చూడ్డానికి ముద్దుగా,బొద్దుగా ఉండే మీరా జాస్మిన్ తెలుగు ప్రేక్షకులని ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రవితేజ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ సరసన నటించి అశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ బొద్దుగుమ్మ 2014లో దుబాయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ని వివాహం చేసుకొంది. కొద్ది రోజుల పాటు వీరి వైవాహిక జీవితం సజావుగానే సాగిన పలు కారణాల వలన మధ్యలోనే విడిపోయారు. దీంతో దుబాయి నుండి ఇండియాకు షిప్ట్ అయిన మీరా జాస్మిన్ మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నించింది.
ప్రముఖ మలయాళీ దర్శకుడు సత్యన్ అంతికాడ్ రూపొందిస్తున్న సినిమాతో మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇవ్వబోతుండగా, ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా తన ఫేస్ బుక్ లో తెలిపాడు . అల వైకుంఠపురంలో ఫేం జయరాం, మీరా జాస్మిన్లు ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కనుంది. జూలైలో ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. మీరా జాస్మిన్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.