శనివారం 30 మే 2020
Cinema - May 06, 2020 , 12:32:51

క‌త్తితో బెదిరించి ఫోన్ ఎత్తుకెళ్ళారు: హీరోయిన్

క‌త్తితో బెదిరించి ఫోన్ ఎత్తుకెళ్ళారు:  హీరోయిన్

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా బంధువు మీరో చోప్రా తెలుగు, హిందీ ప్రేక్ష‌కుల‌కి చాలా సుప‌రిచితం. తెలుగులో ఆమె  బంగారం, వాన, గ్రీకువీరుడు, మారో సినిమాల్లో నటించారు. రీసెంట్‌గా సెక్ష‌న్ 375 అనే హిందీ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించారు. తాజాగా ఈ అమ్మ‌డు త‌న తండ్రిని క‌త్తితో బెదిరించి ఫోన్ లాక్కుపోయార‌నే విష‌యాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వెలుగులోకి తెచ్చారు.

మీరా తండ్రి ఢిల్లీలోని పోలీస్ కాల‌నీలో వాకింగ్‌కి వెళ్లిన‌ప్పుడు స్కూట‌ర్ మీద వ‌చ్చిన ఇద్దరు దుండ‌గులు క‌త్తితో బెదిరించి ఫోన్ లాక్కుపోయార‌ట‌. సుర‌క్షిత‌మైన స్థ‌లంగా చెప్పుకొనే ఢిల్లీలో ఇలాంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం దారుణ‌మ‌ని మీరా పేర్కొన్నారు. ఈ నేరంపై   ఉత్తర ఢిల్లీ డీసీపీ స్పందించారు. మరిన్ని వివరాలు అందించాలని కోరారు. పీసీఆర్‌ పోలీస్‌ లేన్‌, మోడల్‌ టౌన్‌కు సమీపంలోని ప్రిన్స్‌ రోడ్డులో ఈ సంఘ‌ట‌న జ‌రిగింద‌ని మీరా చెప్ప‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు 


logo