బుధవారం 08 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 09:34:38

నటికి వేధింపులు.. ఎన్టీఆర్‌కి రిక్వెస్ట్‌

నటికి వేధింపులు.. ఎన్టీఆర్‌కి రిక్వెస్ట్‌

సోషల్‌ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక సెలబ్రిటీలకి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. సంబంధం లేని విషయాలలో వారిని ఇరికిస్తూ ట్రోల్‌ చేస్తూ ఉంటారు. తాజాగా నటి మీరా చోప్రాకి ఎన్టీఆర్‌ అభిమానుల నుండి వేధింపులు వచ్చాయి. అందుకు కారణం ఏమంటే చాట్‌ సెషన్‌లో తనకి ఫేవరేట్‌ హీరో మహేష్‌ బాబు అని చెప్పడం.

ఆస్క్‌ మీరా అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ట్విట్టర్‌ అభిమానులతో ముచ్చటించిన మీరాని ఓ నెటిజన్‌ మీ ఫేవరేట్‌ హీరో ఎవరని అడగగా, మహేష్‌ అని చెప్పింది. ఎన్టీఆర్ గురించి ఏదైన చెప్పండి అనగానే అందుకు మీరా..నాకు ఎన్టీఆర్ గురించి తెలియదు. ఎందుకంటే నేను ఎన్టీఆర్‌ అభిమానిని కాదు అని అంది. దీంతో హర్ట్‌ అయిన జూనియర్ ఫ్యాన్స్‌ మీరాని ట్విట్టర్‌ వేదికగా ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు. వెంటనే ఆమె సైబర్‌ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. నాపై ట్రోల్‌ చేసిన వారి ట్విట్టర్‌ అకౌంట్స్‌ తొలగించాలని కూడా కోరింది. అంతేకాక దీనిపై ఎన్టీఆర్‌ స్పందించాలని కూడా పేర్కొంది. 


logo