శనివారం 11 జూలై 2020
Cinema - Jun 30, 2020 , 20:25:09

మీరాచోప్రా సెల్ఫీ..నెట్టింట్లో వైరల్‌

మీరాచోప్రా సెల్ఫీ..నెట్టింట్లో వైరల్‌

బంగారం చిత్రంలో పవన్‌కళ్యాణ్‌తో కలిసి నటించి సందడి చేసింది అందాల భామ మీరా చోప్రా. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ దిగిన సెల్ఫీ ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. వైట్‌ అండ్‌ వైట్‌ డ్రెస్‌లో బోల్డ్‌గా కనిపిస్తున్న సెల్ఫీ ఇపుడు ట్రెండింగ్ లో ఉంది. 

వాన, మారో చిత్రాల్లో నటించిన మీరాచోప్రాకు తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. మీరాచోప్రా ప్రస్తుతం మొగలిపువ్వు చిత్రంలో నటిస్తోండగా.. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. మరో హిందీ చిత్రం నాస్తిక్‌లో నటిస్తోంది. logo