ఆదివారం 07 మార్చి 2021
Cinema - Jun 02, 2020 , 20:04:58

ఆ చిన్నారికి అండగా షారుక్ ‘మీర్ పౌండేషన్’

ఆ చిన్నారికి అండగా షారుక్ ‘మీర్ పౌండేషన్’

బీహార్ లోని ముజఫర్ పూర్ రైల్వేస్టేషన్ లో ఓ చిన్నారి తన తల్లి చనిపోయిందని, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందని తెలియక ఆమెను నిద్రలేపేందుకు ప్రయత్నించిన వీడియో అందరినీ కంటతడి పెట్టించిన విషయం తెలిసిందే. వీడియోలో కనిపించిన చిన్నారికి షారుక్ మీర్ ఫౌండేషన్ అండగా నిలిచింది.

సదరు చిన్నారి తన తాత. నానమ్మతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. తల్లి చనిపోయిందని తెలియక పసివాడు ఆమెను నిద్రలేపాలని ప్రయత్నించిన దృశ్యాలు మమ్మల్ని ఎంతో కలిచివేశాయి. ఆ బాబుకు మేం అండగా ఉన్నాం. చిన్నారిని అతని తాత, నానమ్మ సంరక్షిస్తారని మీర్ పౌండేషన్ తెలిపింది. ఆ చిన్నారి బాధేంటో తనకు తెలుసునని..చిన్నారి కుటుంబం వద్దకు వెళ్లేందుకు తమకు సాయమందించిన వారికి షారుక్ ఖాన్ కృతజ్ఞతలు తెలియజేశాడు. 

VIDEOS

logo