ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 15:44:26

కాజ‌ల్ వెడ్డింగ్ కు నో మీడియా క‌వ‌రేజ్..!

కాజ‌ల్ వెడ్డింగ్ కు నో మీడియా క‌వ‌రేజ్..!

టాలీవుడ్ క‌లువు క‌ళ్ల సుంద‌రి త్వ‌ర‌లోనే వివాహం చేసుకోబోతున్న విష‌యం తెలిసిందే. కాజ‌ల్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌత‌మ్ కిచ్లూతో అక్టోబ‌ర్ 30 ఏడ‌డుగులు వేయ‌నుంది. అయితే కోవిడ్ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎవ‌రిని రిస్క్ లో ప‌డేయొద్ద‌నే ఉద్దేశంతో అతికొద్ది మంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో పెళ్లి వేడుక నిర్వ‌హించాల‌ని కాజ‌ల్‌-గౌత‌మ్ నిర్ణ‌యించారు. అయితే కాజ‌ల్ వెడ్డింగ్ పై మ‌రో వార్త ఇపుడు లైమ్ లైట్ లోకి వ‌చ్చింది.

కాజ‌ల్ వెడ్డింగ్ కు మీడియాకు అనుమ‌తించ‌బోమ‌ని..కాజ‌ల్ వ్య‌క్తిగ‌త సిబ్బంది ఒక‌రు తెలిపారు. పెళ్లి వేడుక పూర్త‌యిన త‌ర్వాత వెడ్డింగ్ ఫొటోలు, వీడియోల‌ను కాజ‌ల్ టీం సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేయ‌నుంది. ప్ర‌స్తుతం చిరంజీవి 'ఆచార్య'‌ చిత్రంలో హీరోయిన్ గా న‌టిస్తున్న కాజ‌ల్..డిసెంబ‌ర్ వ‌రకు షూటింగ్ లో పాల్గొనే అవ‌కాశం లేన‌ట్టు తెలుస్తోంది. డిసెంబ‌ర్ త‌ర్వాత ఈ చిత్రానికి డేట్స్ ఇవ్వ‌నుంద‌ని టాక్‌. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo