సోమవారం 03 ఆగస్టు 2020
Cinema - Jul 05, 2020 , 19:39:48

‘ఎమ్‌సీఎ’ సినిమా నా నిజ జీవిత కథే: వేణుశ్రీరామ్

‘ఎమ్‌సీఎ’  సినిమా నా నిజ జీవిత కథే: వేణుశ్రీరామ్

పవన్‌ కల్యాణ్‌తో ‘పింక్‌’ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడు దర్శకుడు వేణుశ్రీరామ్‌. ఈ యువదర్శకుడు నానితో తీసిన ‘ఎమ్‌సీఎ’ మంచి విజయాన్ని అందుకుంది. తన నిజ జీవిత కథతో ‘ఎమ్‌సీఎ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి) సినిమాని రూపొందించినట్లుగా  వేణుశ్రీరామ్ తెలిపారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..‘చదువుకునే రోజుల్లో తమ్ముడు నేను ఒకే రూమ్‌లో కలిసివుండేవాళ్లం. ఒకరికొకరం ఎంతో ప్రేమగా వుండేవాళ్లం. కానీ పెళ్లయ్యాక మా మధ్య మూడోవ్యక్తిగా నా భార్య రావడంతో నా తమ్ముడిలో ఒక రకమైన అభద్రతభావం కనిపించేది. ఒక వ్యక్తిపై ప్రేమ వుంటేనే అలాంటి ఫీలింగ్‌ కలుగుతుందని అనిపించింది. ఈ నిజజీవిత నేపథ్యానికి సినిమా హంగులు జోడించి ఎమ్‌సీఎ తెరకెక్కించాను. జనాలకు కూడా ఎమోషన్‌ నచ్చడంతో కమర్షియల్‌గా ఘనవిజయం సాధించింది’ అని వేణుశ్రీరామ్ చెప్పారు.


logo