ఆదివారం 31 మే 2020
Cinema - May 23, 2020 , 09:17:03

అక్కినేని ఫ్యాన్స్‌కి మే 23 మ‌ధుర జ్ఞాప‌కం

అక్కినేని ఫ్యాన్స్‌కి మే 23 మ‌ధుర జ్ఞాప‌కం

మే 23 అక్కినేని ఫ్యామిలీకి ఓ మ‌ధుర జ్ఞాప‌కంగా మారింది. ఇదే రోజు 1986లో నాగార్జున న‌టించిన తొలి చిత్రం విక్ర‌మ్ సినిమా విడుద‌లైంది. ఈ చిత్రం ఫ్యాన్స్‌కి మంచి వినోదాన్ని అందించింది. ఇక మే 23, 2014లో అక్కినేని ఫ్యామిలీ ఎవ‌ర్‌గ్రీన్ చిత్రం మ‌నం విడుద‌లైంది. ఈ చిత్రం అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు కుటుంబానికి కూడా మ‌ధురానుభూతిని మిగిల్చింది.

అన్నపూర్ణ స్టూడియోస్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన మల్టీస్టారర్ సినిమా మనం. అక్కినేని కుటుంబంలో మూడు తరాల నటులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన ఈ అరుదైన చిత్రంలో శ్రియా, సమంత కథానాయికలుగా నటించారు . విక్రమ్ కుమార్ ఈ సినిమాకి కథ, చిత్రానువాదం, దర్శకత్వాన్ని అందించగా అమృతం ధారావాహికలో ముఖ్యపాత్ర పోషించిన హాస్యనటుడు హర్షవర్ధన్ సంభాషణలు రచించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు . అఖిల్ చిత్రంలో ముఖ్య ప‌త్ర పోషించాడు. నేటితో ఈ చిత్రం విడుద‌లై ఆరేళ్ళు కావ‌డంతో అక్కినేని ఫ్యాన్స్ చిత్ర జ్ఞాప‌కాల‌ని గుర్తు చేసుకుంటున్నారు.


logo