శుక్రవారం 05 మార్చి 2021
Cinema - Jan 20, 2021 , 15:58:41

‘మాస్టర్’ వీడియో లీక్..నిర్మాత రూ.25 కోట్లు డిమాండ్‌

‘మాస్టర్’ వీడియో లీక్..నిర్మాత రూ.25 కోట్లు డిమాండ్‌

తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం మాస్టర్. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తుంది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ పరంగా కూడా కుమ్మేస్తుంది. ఈ సినిమా ఇప్పటికే 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు. పండక్కి వచ్చిన ఈ సినిమాకు తెలుగులో సోసో టాక్ వచ్చింది..కానీ కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. ఇప్పటి వరకు తెలుగులో 12 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది మాస్టర్. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 9 కోట్లు మాత్రమే. ఇప్పటికే లాభాలు కూడా తీసుకొచ్చాడు మాస్టర్. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే ఓ వీడియో లీక్ అయింది.

క్లైమాక్స్ ఫైట్ తో పాటు మరికొన్ని సీన్స్ కూడా లీక్ అయ్యాయి. విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో వీడియోని లీక్ చేసిన కారణంగా భారీ నష్ట పరిహారం కోరుతూ ప్రముఖ చిత్ర నిర్మాత.. ఓ డిజిటల్‌ కంపెనీకి నోటీసులు పంపించారు. 'మాస్టర్‌' కాపీని ఓవర్సీస్ కు పంపించమని వాళ్లను నమ్మి ఓ డిజిటల్‌ సంస్థకు ప్రింట్‌ను చిత్ర యూనిట్ అందించగా.. అక్కడ్నుంచే ఈ సీన్స్ బయటికి లీక్ అయ్యాయి. ఆ సంస్థలో పని చేసే ఓ వ్యక్తే పైరసీకి పాల్పడ్డాడని ఇటీవల గుర్తించారు. దాంతో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసారు.. అక్కడితో ఆగకుండా కంపెనీని కూడా నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీసులు పంపించారు. 

ఏడాదిన్నర పాటు కష్టపడి.. దాదాపు 100 కోట్లతో నిర్మించిన తమ సినిమాను పైరసీ చేసి.. తమకు ఇబ్బందులు కలిగించిన డిజిటల్‌ సంస్థను 25 కోట్ల నష్ట పరిహారం కోరుతూ చిత్ర నిర్మాత లలిత్‌కుమార్‌ నోటీసులు పంపించాడు. ఈ మేరకు తమకు వెంటనే 25 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసారు. ఈ ఘటనపై సదరు డిజిటల్ సంస్థ మాస్టర్ యూనిట్ తో చర్చలు జరుపుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలిక.

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

శింబును వెలేసిన నిర్మాతల మండలి..?

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..

'వ‌కీల్‌సాబ్' కామిక్ బుక్ క‌వ‌ర్ లుక్ అదిరింది


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo