బుధవారం 03 మార్చి 2021
Cinema - Jan 24, 2021 , 06:56:37

ఓటీటీలో అడుగుపెట్ట‌బోతున్న మాస్ట‌ర్

ఓటీటీలో అడుగుపెట్ట‌బోతున్న మాస్ట‌ర్

లాక్ డౌన్ త‌ర్వాత కోలీవుడ్‌లో విడుద‌లైన తొలి త‌మిళ చిత్రం మాస్ట‌ర్. విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న విడుద‌లైంది. లోకేష‌న్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన ఈ చిత్రానికి 200 కోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. గ‌తంలో ‘మెర్సల్’ (అదిరింది), ‘సర్కార్’,‘బిగిల్’ (విజిల్) చిత్రాలు 200 కోట్ల క్ల‌బ్‌లో చేర‌గా, ఇప్పుడు మాస్ట‌ర్ ఆ క్ల‌బ్‌లో చేరిన నాలుగో చిత్రంగా నిలిచింది. 

మాస్ట‌ర్ చిత్రం గ‌త ఏడాది విడుద‌ల కావ‌ల‌సి ఉన్న‌ప్ప‌టికీ క‌రోనా వ‌ల‌న వాయిదా పడింది. ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 13న థియేట‌ర్స్‌లోకి తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు ఈ మూవీని ఫిబ్ర‌వ‌రి 12 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్టు ప్ర‌క‌టించారు. థియేట‌ర్‌లో సినిమా చూడ‌ని ప్రైమ్‌లో చూసి ఆనందించాల‌ని మేక‌ర్స్ కోరుతున్నారు.  

VIDEOS

logo