శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 20, 2021 , 19:59:34

‘మాస్టర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్

‘మాస్టర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్

విజయ్ సినిమాలు కూడా తెలుగులో మెల్లగా దూకుడు చూపిస్తున్నాయి. తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ సంపాదించుకుంటున్నాడు విజయ్. దానికి ఇప్పుడు మాస్టర్ సినిమానే నిదర్శనం. ప్యాండమిక్‌లో 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైనా కూడా విజయ్ గత సినిమాల రికార్డులను ఈ సినిమా క్రాస్ చేసింది. క్రాక్, రెడ్ లాంటి తెలుగు సినిమాలు పోటీలో ఉన్నా కూడా వారం రోజుల్లోనే దాదాపు 13 కోట్ల షేర్ వసూలు చేసింది మాస్టర్. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాకు తెలుగు ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పట్టారు. విజయ్ కు టాలీవుడ్ లోనూ మంచి ఇమేజ్ వచ్చిందని చెప్పడానికి మాస్టర్ వసూళ్లే సాక్ష్యం. యావరేజ్ టాక్ తెచ్చుకున్న మాస్టర్ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోయింది.

ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో 130 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన మాస్టర్.. తెలుగులోనూ సత్తా చూపిస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం వారం రోజుల్లో 12.82 కోట్ల షేర్ తీసుకొచ్చింది. 50 శాతం టికెట్లు మాత్రమే అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినా.. కొన్ని చోట్ల మాత్రం 100% టికెట్స్ అమ్మేస్తున్నారు. తమిళనాట మాస్టర్ టికెట్స్ కోసం మినీ యుద్ధమే జరుగుతుంది. తెలుగులో కూడా ఈ సినిమా కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. ఎలా చూసుకున్నా కూడా కరోనా వైరస్ తర్వాత ప్రేక్షకుల్లో ఉన్న భయం పోగొట్టి థియేటర్ ల వరకు వాళ్లను రప్పించడంలో సక్సెస్ అయ్యాడు మాస్టర్. మరి ఏపీ, తెలంగాణలో వారం రోజుల్లో మొత్తం ఎంత తీసుకొచ్చింది చూద్దాం.. 

ఏపీ, తెలంగాణలో ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. 

నైజాం –  3.12 కోట్లు 

సీడెడ్ – 2.49 కోట్లు

ఉత్తరాంధ్ర – 2.19 కోట్లు

ఈస్ట్ – 1.04 కోట్లు

వెస్ట్ – 1.19 కోట్లు

కృష్ణా – 1.01 కోట్లు

గుంటూరు – 1.20 కోట్లు

నెల్లూరు – 59 లక్షలు

 ఏపీ తెలంగాణలో 7 డేస్ కలెక్షన్స్.. 12.82 కోట్లు షేర్ (జరిగిన బిజినెస్ 9 కోట్లు)

తమిళనాట వారం రోజుల కలెక్షన్స్.. 65 కోట్లు గ్రాస్ (షేర్ దాదాపు 40 కోట్లు)

ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. 132 కోట్లు గ్రాస్

ఇవి కూడా చ‌ద‌వండి..

శృతిహాస‌న్‌, అమ‌లాపాల్‌..బోల్డ్‌గా 'పిట్ట‌క‌థ‌లు' టీజ‌ర్‌

కిస్ ఇవ్వ‌లేద‌ని.. ఆమె న‌న్ను వదిలేసి వెళ్లింది

రాశీఖ‌న్నాకు నో చెప్పిన గోపీచంద్‌..!

మాల్దీవుల్లో మెరిసిన సారా..ఫొటోలు వైర‌ల్‌

టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ విల‌న్ ఇత‌డే..!

నన్ను ఫాలో కావొద్దు..రియాచ‌క్ర‌వ‌ర్తి వీడియో వైర‌ల్‌

చిరంజీవి న‌న్ను చాలా మెచ్చుకున్నారు..లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo