శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Cinema - Jul 14, 2020 , 22:10:14

మ‌ళ్లీ మేక‌ప్ వేసుకునేందుకు 'మాస్' విల‌న్ రెడీ

మ‌ళ్లీ మేక‌ప్ వేసుకునేందుకు 'మాస్' విల‌న్ రెడీ

ట‌క్క‌రి దొంగ‌, సింహాద్రి, సీత‌య్య‌, మాస్, ఎవ‌డు, నాయ‌క్, లౌక్యంతోపాటు ప‌లు చిత్రాల్లో త‌న విల‌నిజంతో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు బాలీవుడ్ న‌టుడు రాహుల్ దేవ్‌. సుమారు మూడు నెల‌లపాటు లాక్ డౌన్ ఉండిపోయిన ఈ యాక్ట‌ర్ మ‌ళ్లీ మేక‌ప్ వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. 3 నెల‌ల లాక్ డౌన్ త‌ర్వాత  కొత్త ఉత్సాహంతో సినిమా షూటింగ్ షురూ చేయ‌నున్న‌ కొద్ది మంది యాక్ట‌ర్ల‌లో నేను ఒక‌డిని.  సెట్స్‌కు వెళ్ల‌డం, కెమెరాను ఫేస్ చేయ‌డం వంటి వాటికి లాక్ డౌన్ తో దూర‌మైపోయా.

మ‌ళ్లీ తిరిగి ప‌నిలోకి (షూటింగ్) రావ‌డం గొప్ప ఫీలింగ్ క‌లుగుతుంద‌ని రాహుల్ దేవ్ అన్నాడు.  వెబ్ సిరీస్ తోపాటు ప‌లు క్రేజీ ప్రాజెక్టులు రాహుల్ దేవ్ చేతిలో ఉన్నాయి. సంజ‌య్ ద‌త్ తో క‌లిసి టోర్బాజ్ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. పాయిజ‌న్ -2 వెబ్ సిరీస్ లో పోలీసాఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నాడు. దీంతోపాటు మొఘ‌ల్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా కీల‌క పాత్ర‌లో నటిస్తున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo