e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home News త‌న బ‌యోపిక్ సూర్య చేస్తే బాగుంటుంద‌న్న రైనా

త‌న బ‌యోపిక్ సూర్య చేస్తే బాగుంటుంద‌న్న రైనా

త‌న బ‌యోపిక్ సూర్య చేస్తే బాగుంటుంద‌న్న రైనా

ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో బ‌యోపిక్ ట్రెండ్ న‌డుస్తుంది. సినీ, క్రీడా, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు సంబంధించిన బ‌యోపిక్స్ రూపొందుతుండ‌గా, ఇప్పుడు రైనా బ‌యోపిక్ విష‌యంపై చ‌ర్చ న‌డుస్తుంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మీ బ‌యోపిక్ తీస్తే, అందులో ఏ న‌టుడు న‌టించాలని మీరు అనుకుంటారు అని యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా, అందుకు సూర్య అని స‌మాధానం చెప్పాడు. సూర్య న‌ట‌న చాలా బాగుంటుంది. పాత్ర‌ల‌కు అనుగుణంగా ఆయ‌న త‌న శైలిని మార్చుకుంటారు అని చెప్పుకొచ్చాడు. గ‌తంలో కిచ్చా సుదీప్ త‌న ఫేవ‌రేట్ హీరో అని చెప్పిన రైనా ఆయ‌న సినిమాలు త‌ప్ప ఇత‌ర హీరోలు చూడ‌న‌ని చెప్పిన విష‌యం తెలిసిందే.

ద్రవిడ్‌ సారధ్యంలో వన్డేల్లో అరంగేట్రం చేసిన రైనా టీమిండియా తరపున 18 టెస్టుల్లో 768 పరుగులు, 226 వన్డేల్లో 5615 పరుగులు, 78 టీ20ల్లో 1605 పరుగులు సాధించాడు. టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించి తొలి భారత ఆటగాడిగా రైనా రికార్డు సృష్టించాడు. ఇక, గతేడాది ఆగస్టు 15న ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన కాసేపటికే రైనా కూడా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
త‌న బ‌యోపిక్ సూర్య చేస్తే బాగుంటుంద‌న్న రైనా
త‌న బ‌యోపిక్ సూర్య చేస్తే బాగుంటుంద‌న్న రైనా
త‌న బ‌యోపిక్ సూర్య చేస్తే బాగుంటుంద‌న్న రైనా

ట్రెండింగ్‌

Advertisement