బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 18, 2020 , 10:01:36

'ఖిలాడీ'గా రానున్న ర‌వితేజ‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

'ఖిలాడీ'గా రానున్న ర‌వితేజ‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

బెంగాల్ టైగ‌ర్ చిత్రం త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ర‌వితేజ ఇప్పుడు వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఓ సినిమా సెట్స్ పైన ఉండ‌గానే మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తున్నారు. ర‌వితేజ ప్ర‌స్తుతం క్రాక్ అనే చిత్రంతో బిజీగా ఉన్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని  సరస్వతి ఫిలిమ్స్‌ డివిజన్‌ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. శృతిహాసన్‌ కథానాయికగా న‌టిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో రవితేజ, అప్సరారాణిలపై  ప్రత్యేకగీతాన్ని చిత్రీకరిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది.  

త్వ‌ర‌లో వీర చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ‌తో క‌లిసి ర‌వితేజ త‌న 67వ చిత్రం చేయ‌నుండ‌గా, శ‌నివారం ఈ మూవీ ప్రీ లుక్ విడుద‌ల చేశారు. తాజాగా ఫ‌స్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేశారు. మూవీకి ఖిలాడీ అనే టైటిల్‌ని ఫిక్స్ చేయ‌గా, పోస్ట‌ర్‌లో రవితేజ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. నవంబ‌ర్ 2 నుండి మూవీ షూటింగ్ జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో   డింపుల్ హయాతి, మీనాక్షి చౌధురిని క‌థానాయిక‌గా ఎంపిక చేశారు.  తెలుగమ్మాయి అయిన డింపుల్ హయాతి ‘గద్దలకొండ గణేష్‌’లో ‘జర్ర జర్ర...’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  ‘రాక్షసుడు’ బ్లాక్‌‌బస్టర్ తర్వాత రమేశ్‌ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. 



logo