శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 31, 2020 , 01:53:34

కాజల్‌ అగర్వాల్‌కు పెళ్లి కళ

కాజల్‌ అగర్వాల్‌కు పెళ్లి కళ

యువతరం కలల రాణిగా భాసిల్లుతున్న వెండితెర అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. చిరకాల ప్రియుడు గౌతమ్‌ కిచ్లుతో ఆమె వివాహం శుక్రవారం ముంబయిలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌ ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి ఇరు కుటుంబాల సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఎరుపురంగు లెహంగా ధరించి పెళ్లి వస్ర్తాల్లో కాజల్‌ అగర్వాల్‌ నిండు జాబిలిలా వెలిగిపోయింది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో పెళ్లి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా కాజల్‌ అగర్వాల్‌కు పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలందజేశారు.