బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 27, 2020 , 08:28:25

శ్రీముఖి అండ్ గ్యాంగ్ సంద‌డి చూస్తారా..!

శ్రీముఖి అండ్ గ్యాంగ్ సంద‌డి చూస్తారా..!

లౌడ్ స్పీక‌ర్ శ్రీముఖి ఇంట్లో ఉంటూనే ప్రేక్ష‌కుల‌కి మంచి ఫ‌న్ అందిస్తుంది. అవినాష్‌, విష్ణుప్రియ‌ల‌తో క‌లిసి రీసెంట్‌గా స్పూఫ్ స్కిట్‌ల‌తో వ‌చ్చిన శ్రీముఖి ఇప్పుడు త‌న కో యాంక‌ర్స్‌తో క‌లిసి హంగామా చేసింది. త‌న‌కి బోర్ కొడుతున్న స‌మ‌యంలో మిర్చి హేమంత్‌, గీతా, మంజూష‌, విద్య‌ల‌కి వీడియో కాల్ చేసి వాళ్లు ఏం ఏం చేస్తున్నారో అడిగి తెలుసుకుంది. వారంద‌రు ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో ఇంట్లోనే ఉంటూ త‌మ‌లో దాగి ఉన్న టాలెంట్స్‌ని బ‌య‌ట‌కి తీసుకొస్తున్న‌ట్టు శ్రీముఖితో చెప్పుకొచ్చారు. సో క‌రోనా స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు నెగెటివిని పక్క‌న పెట్టి కొత్త విష‌యాల‌ని నేర్చుకునే ప్ర‌య‌త్నం చేద్దాం అని షార్ట్ ఫిలిం ద్వారా చెప్పుకొచ్చారు. మార్పు మంచిదే టైటిల్‌తో రూపొందిన ఈ షార్ట్ ఫిలింపై మీరు ఓ లుక్కేయండి. logo