శుక్రవారం 03 జూలై 2020
Cinema - Apr 07, 2020 , 10:22:32

లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత ప్ర‌భాస్ 20 నుండి మ‌రిన్ని అప్‌డేట్స్

లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత ప్ర‌భాస్ 20 నుండి మ‌రిన్ని అప్‌డేట్స్

సాహో చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్.. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓ డియ‌ర్ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి ప‌రిశీలిస్తుండ‌గా, ఇటీవ‌ల ఈ చిత్రం జార్జియాలో ఓ షెడ్యూల్ జ‌రుపుకుంది. ఈ షెడ్యూల్‌లో ప్ర‌భాస్‌, పూజా హెగ్డేపై కీల‌క స‌న్నివేశాల‌తో పాటు ప‌లు సాంగ్స్ రూపొందించారు. స‌మ్మ‌ర్‌లో మూవీని రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావించిన‌ప్ప‌టికీ, లాక్ డౌన్ కార‌ణంగా రిలీజ్ ఎప్పుడు చేస్తార‌నేది ప్ర‌శ్నార్ధ‌కంగా మారింది.

ప్ర‌భాస్ తాజా చిత్రానికి సంబంధించి ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి అప్‌డేట్స్ రాక‌పోవ‌డంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత సంస్థ కొద్ది సేప‌టి క్రితం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌స్తుతం కరోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అంద‌రం చాలా ఇబ్బంది ప‌డుతున్నాము. ప్రాణాలు ప్ర‌మాదంలో ఉన్నాయి. మా సినిమా ప‌నుల‌న్నింటికి తాత్కాలిక బ్రేక్ వేసాం. లాక్‌డౌన్ ముగిసిన త‌ర్వాత మ‌రిన్ని అప్‌డేట్స్‌తో వ‌స్తాము.  ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలని మేము కోరుతున్నాము అని యూవీ క్రియేష‌న్స్ తెలిపింది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo