ఫెమినా మిస్ ఇండియా 2017 (Femina Miss India 2017)గా నిలిచి కోట్లాదిమంది మనసు గెలుచుకుంది హర్యాన్వి సుందరి మానుషి ఛిల్లర్ (Manushi Chhillar). ప్రస్తుతం బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి పృథ్విరాజ్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసేందుకు సిద్దమవుతుంది. ఈ భామ హాట్ హాట్ స్టిల్స్ తో అందరికీ నిద్రపట్టకుండా చేస్తోంది. చేతికి ఫ్యాన్సీ గాజులుమరోవైపు మానుషి నటించిన ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫ్లోరల్ మొజాయిక్ ముద్రించబడిన లెహెంగా, టాప్ డ్రెస్ లో తళుక్కున మెరిసిపోతుంది.
ఇప్పటికే ఓ కిరీటాన్ని గెలుచుకున్న మానుషి ఛిల్లర్ తాజాగా అరుదైన, విచిత్రమైన భారతదేశపు హాటెస్ట్ వెజిటేరియన్ టైటిల్ (India’s Hottest Vegetarian) ను కూడా కైవసం చేసుకుంది. మొత్తానికి ఇప్పటివరకు ఎవరూ పొందలేని అరుదైన టైటిల్ను గెలుచుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది మానుషి ఛిల్లర్. మానుషి ఛిల్లర్ తాజా ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. పృథ్విరాజ్ చిత్రాన్ని చారిత్రాత్మక యాక్షన్ డ్రామా నేపథ్యంలో చంద్రప్రకాశ్ ద్వివేది తెరకెక్కిస్తుండగా..యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ , సోనూసూద్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇండియా నుంచి మిస్ వరల్డ్ పోటీల్లో గెలుపొందిన రెండో వైద్య విద్యార్థినిగా మానుషి ఛిల్లర్ నిలిచింది. మానుషి ఛిల్లర్ కన్నా ముందు వైద్య విద్యార్థిని రీటాఫారియా (1966)మిస్ వరల్డ్ పోటీల్లో గెలుపొందారు.
Sonu Sood: మరో ప్రాణాన్ని నిలబెట్టిన సోనూసూద్.. బిగ్ డే అంటూ ట్వీట్
Tiger 3 | సల్మాన్, కత్రినా పాట చాలా కాస్లీ గురూ..బడ్జెట్ ఎంతంటే..?
Vijay Deverakonda | ముంబైతో పోలిస్తే నేను సోమరి హైదరాబాదీని