బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 06, 2020 , 10:37:55

ప‌టాకులు కాల్చిన వారిని ఏకిపారేసిన హీరో

ప‌టాకులు కాల్చిన వారిని ఏకిపారేసిన హీరో

కరోనా తీవ్రంగా విజృంబిస్తున్న నేప‌థ్యంలోను కొంద‌రు మూర్ఖంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. గ‌తంలో మోదీ .. వైద్యుల‌కి సంఘీభావంగా చ‌ప్ప‌ట్లు కొట్ట‌మ‌ట్టే డ్ర‌మ్స్ వాయించుకుంటూ రోడ్ల‌పై విచ్చ‌ల‌విడిగా తిరిగారు. తాజాగా దీపాలు వెలిగించ‌మంటే అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తూ  దీపాలకు బదులుగా భారీ శబ్ధాలతో బాణాసంచా కాల్చి తోటి వారికి ఇబ్బంది క‌లిగించారు. ఈ వ్య‌వ‌హారంపై ప్ర‌ముఖులు, ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు మండిప‌డుతున్నారు

తాజాగా ఓ నెటిజ‌న్ బాణాసంచా కాల్చ‌డం వ‌ల‌న మా ఇంటి ప‌క్క‌న భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెబుతూ దానికి సంబంధించి వీడియో షేర్ చేశాడు. ఇది చూసి ఒళ్లు మండిన మంచు మనోజ్ ట్విట్టర్ వేదిక‌గా రెచ్చిపోయాడు. ఈ క్రాకర్స్  కాల్చ‌డం చూస్తే.. మనవాళ్లు కరోనాని కూడా సీఎం లేదా పీఎం చేస్తారనుకుంటా.. ఓరి దీనమ్మా బతుకు.. మళ్లీ జై కరోనా అంట’ అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాక  ‘రేయ్ ఇడియట్స్.. ఆ క్రాకర్స్ కాల్చడం ఆపండ్రా.. మనం మనుషులే తప్ప మూర్ఖులం కాదు.. క్రాకర్స్ కాల్చమని మిమ్మల్ని ఎవరూ అడగలేదు.. జి బలిసిన చదువుకున్న వాళ్లు మాత్రమే ఇలాంటి పనికి మాలిన పనులు చేస్తారు’ అంటూ క్రాకర్స్ కాల్చిన వాళ్లపై ఫుల్ ఫైర్ అయ్యాడు మ‌నోజ్ .

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo