శనివారం 08 ఆగస్టు 2020
Cinema - Jul 02, 2020 , 11:41:57

ఒకానొక స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నా: మ‌నోజ్

ఒకానొక స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నా: మ‌నోజ్

సుశాంత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత బాలీవుడ్‌లో నెల‌కొన్న అనేక విషాద గాథ‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. సుశాంత్ నెపోటిజం వ‌ల‌న బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందాడ‌నే ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో కొంద‌రు సెల‌బ్రిటీలు మేం కూడా ఒక‌ప్పుడు సూసైడ్ చేసుకోవాల‌నుకున్నాం అని మ‌న‌సులో దాగిన బాధ‌ల‌ని వెళ్ల‌గ‌క్కుతున్నారు. తాజాగా అవార్డ్‌ విన్నింగ్‌ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఒకానొక స‌మ‌యంలో ఆత్మ హ‌త్య చేసుకోవాల‌ని భావించిన‌ట్టు పేర్కొన్నారు.

మ‌నోజ్ త‌న స్వ‌గ‌తం గురించి మాట్లాడుతూ.. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన నేను ఎన్నో క‌ష్టాల‌ని అనుభ‌వించాను. మేం ఐదుగురు తోబుట్టువులం కాగా, అంద‌రం గుడిసెలో న‌డిచే స్కూల్‌లో చ‌దువుకున్నాం. తొలిసారి తొమ్మిదో ఏట సిటీకి వెళ్ళాను. థియేట‌ర్‌లో సినిమా చూశా. అమితాబ్ అంటే ఆరాధ‌న పెరిగింది. ఆయ‌న్ని చూసి న‌టుడిని కావాల‌నే క‌సి పెరిగింది. న‌టుడిగా మార‌డం క‌ష్ట‌మైన ప‌ని అని తెలిసిన కూడా న‌ట‌నే నా జీవిత గ‌మ్యం అని భావించాను.

17వ ఏట డీయూ వెళ్ళిన నేను అక్క‌డ థియేట‌ర్‌లో చేరాను. ఈ విష‌యం నా ఫ్యామిలీకి తెలియ‌దు. నా మ‌న‌సులోని భావాల‌ని ఉత్త‌రం ద్వారా కుటుంబానికి చేర‌వేసాను. నా ప‌రిస్థితిని అర్ధం చేసుకున్న వారు ఫీజు క‌ట్ట‌డం కోసం రూ. 2 వేలు పంపారు. ఇక అక్క‌డ ప‌రిస్థితుల‌కి అల‌వాటు ప‌డేందుకు చాలా కృషి చేశాను. ఇంగ్లీష్‌, హిందీ, భోజ్‌పూరి భాష‌లు నేర్చుకున్నా. ఆయా భాష‌ల‌లో మాట్లాడటం ఇంకా పెద్ద పరీక్ష. అప్పుడు నేను ఎన్‌ఎస్‌డీకి అప్లై చేశాను. కానీ మూడు సార్లు తిరస్కరించారు. చాలా బాధపడ్డాను. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను అని మ‌నోజ్ బాజ్‌పేయ్ అన్నారు.

నా బాధ‌ల‌ని అర్ధం చేసుకున్న నా స్నేహితులు న‌న్ను కంటికి రెప్ప‌లా చూసుకున్నారు. నన్ను సింగిల్‌గా ఉండ‌నిచ్చే వారు కాదు. ప‌డుకునేప్పుడు కూడా నా ప‌క్క‌నే ప‌డుకునే వారు. ఒక రోజు చాయ్ షాపులో ఉన్న నా ద‌గ్గ‌రికి వ‌చ్చిన శేఖ‌ర్ క‌పూర్.. ‘బండిట్‌ క్వీన్’‌లో న‌టించాల‌ని అన్నాడు . వెంట‌నే ఒకే  చెప్పి  ముంబైకి బయల్దేరాను . ముంబైలో నా జీవితం చాలా దుర్భరం. ఐదుగురం ఒకే గ‌దిలో ఉండేవాళ్ళం. అవ‌కాశాల కోసం కాళ్ళ‌రిగేలా తిరిగాను. ఓ కంపెనీ నా ఎదురుగానే ఫోటోలు చించేసింది. షూటింగ్ మ‌ధ్య‌లోనే నన్ను వెళ్ళిపొమ్మ‌న్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. 

నాలుగేళ్ళ పోరాటం త‌ర్వాత మహేష్ భట్ టీవీ సిరీస్‌లో ఓ అవకాశం వచ్చింది. ప్రతి ఎపిసోడ్‌కు నాకు రూ .1500 ఇచ్చేవారు. కొద్ది రోజుల త‌ర్వాత సినిమా ఆఫ‌ర్ వ‌చ్చింది. స‌త్య సినిమా త‌ర్వాత నా ద‌శ తిరిగింది. ఇక వెన‌క్కి తిరిగి చూసే ఛాన్స్ లేకుండా పోయింది.  ప‌లు అవార్డులు వ‌చ్చాయి. ఇళ్లు కొనుకున్నాను. నా క‌ల‌ని నిజం చేసుకునే క్ర‌మంలో వ‌చ్చిన క‌ష్టాల‌ని ఏ రోజు ప‌ట్టించుకోలేదు అని మనోజ్ బాజ్‌పాయ్ స్ప‌ష్టం చేశారు 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo