ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 17, 2020 , 15:46:49

ప్ర‌ధాని మోదీ "మ‌నోవిరాగి" ఫ‌స్ట్ లుక్‌

ప్ర‌ధాని మోదీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం మ‌న్ భైరాగి. తెలుగులో మ‌నో విరాగి పేరుతో విడుద‌ల కానుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత సంజ‌య్ లీలా బ‌న్సాలీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మోదీ 70వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టాలీవుడ్ న‌టుడు ప్ర‌భాస్ తెలుగు వెర్ష‌న్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశాడు. పోస్ట‌ర్ లో ఓ వైపు మోదీ యువ‌కుడి లుక్ క‌నిపిస్తుండ‌గా..మరోవైపు ఓ వ్య‌క్తి బ్యాగు వేసుకుని మ‌ట్టి రోడ్డుపై నుంచి న‌డుచుకుంటూ వ‌స్తున్నాడు.

ప్ర‌త్యేక‌మైన రోజున ఓ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిపై ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత సంజ‌య్ లీలా నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌డం లాంఛ్ చేయ‌డం సంతోషంగా ఉంది. ప్ర‌ధాని మోదీ గురించి ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని క‌థ ఇది. సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌రోవైపు ఈ మూవీ హిందీ పోస్ట‌ర్ ను అక్ష‌య్ కుమార్ లాంఛ్ చేశాడు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.