బుధవారం 21 అక్టోబర్ 2020
Cinema - Oct 02, 2020 , 10:25:16

ప్ర‌ముఖ నిర్మాత మృతి.. విషాదంలో కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌

ప్ర‌ముఖ నిర్మాత మృతి.. విషాదంలో కోలీవుడ్ ప‌రిశ్ర‌మ‌

శింబు ప్ర‌ధాన పాత్ర‌లో మ‌న్మథన్ అనే చిత్రాన్ని తెర‌కెక్కించి అంద‌రి దృష్టిని ఆకర్షించిన ప్ర‌ముఖ నిర్మాత కృష్ణ‌కాంత్. లక్ష్మీ మూవీ మేకర్స్‌ సంస్థలో మేనేజర్‌గా పని చేసిన ఆయ‌న తిరుడా తిరిడి అనే చిత్రంతో నిర్మాత‌గా మారారు. ఆ త‌ర్వాత కింగ్, పుదుకోట్టైలిరిందు శరవణన్, చొల్లి అడిప్పేన్, మచ్చి వంటి చిత్రాలను నిర్మించారు. బుధ‌వారం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో కుటుంబ స‌భ్యులు చెన్నైలోని ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఆసుప‌త్రికి వెళ్ళిన కొద్ది సేప‌టికి కృష్ణ‌కాంత్ క‌న్నుమూశారు. కృష్ణకాంత్‌కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. గురువారం ఆయన అంత్య‌క్రియ‌లు నిర్వహించ‌గా, ప‌లువురు ప్ర‌ముఖులు కృష్ణ‌కాంత్‌కు నివాళులు అర్పించారు. కృష్ణ‌కాంత్ మృతిపై విచారం వ్య‌క్తం చేసిన శింబు.. మేము మంచి వ్యక్తులను కోల్పోయాం. 'మన్మధన్' నా జీవితంలో మరపురాని అనుభవాలలో ఒకటి. మిస్టర్ కృష్ణకాంత్ నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు.  కృష్ణకాంత్ మంచి వ్యక్తి, నన్ను స్క్రిప్ట్ రాయమని ప్రోత్సహించడమే కాకుండా, నాపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. అతని మరణం  న‌న్ను షాక్‌కు గురి చేసింది. కుటుంబ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను అని శింబు ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. 


logo