తన మ్యూజిక్ బీట్స్ తో గూస్బంప్స్ తెప్పిస్తూ సినిమాను రక్తికట్టించడంలో మెలోడీ బ్రహ్మ మణిశర్మ రూటే సెపరేటు. మణిశర్మ మ్యూజిక్ తో సూపర్‌హిట్‌గా నిలిచి కలెక్షన్లను సృష్టించిన సినిమాలెన్నో ఉన్నాయి.
ఈ మ్యూజిక్ మాంత్రికుడు ఇపుడు సీటీమార్‌తో అందరికీ ఆహ్లాదాన్ని పంచడానికి వస్తున్నాడు. సీటీమార్ కోసం మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోరును సెట్ చేస్తుండగా..వర్క్‌మోడ్‌లో ఉన్నపుడు తీసిన వీడియోను సంపత్ నంది ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నాడు.
ఈ మేజిషియన్ తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని వీడియో ద్వారా తెలిపాడు సంపత్ నంది. వీడియోలో మణిశర్మ బీజీఎం బీట్ ఇంట్రడక్షన్ ఓ రేంజ్ లో ఉంది. శాంపుల్ బ్యాగ్రౌండ్ స్కోరే ఇలా ఉంటే..ఇక ట్రైలర్, సినిమాలో ఎలా ఉంటుందో చూడాలి.
గోపీచంద్-తమన్నా హీరోహీరోయిన్లుగా కబడ్డీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న థియేటర్లలో సందడి చేయనుంది.