శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 27, 2020 , 15:19:32

ఫ్యామిలీతో ద‌స‌రా సెల‌బ్రేట్ చేసుకున్న‌ మ‌నీషా కొయిరాలా

ఫ్యామిలీతో ద‌స‌రా సెల‌బ్రేట్ చేసుకున్న‌ మ‌నీషా కొయిరాలా

నేపాల్ బ్యూటీ మనీషా కొయిరాలా సినీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుండి వ‌చ్చిన మ‌నీషా బాలీవుడ్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపుని తెచ్చుకుంది. కొయిరాలా పాఠశాలలో చదువుతుండగానే 1989 లో ఫేరి భేతౌలా అనే నేపాలీ సినిమాలో మొదటిసారి నటించింది.  1991 లో వచ్చిన హిందీ సినిమా సౌదాగర్ తో బాలీవుడ్ లో ప్రవేశించింది. ఆ త‌ర్వాత అనేక సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించింది. 

చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ద‌స‌రా పండుగ‌ను ప్ర‌తి ఒక్క‌రు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ప్ర‌స్తుతం నేపాల్‌లో ఉన్న మ‌నీషా ఫ్యామిలీ కూడా విజ‌య‌ద‌శ‌మిని ఉత్సాహంగా సెల‌బ్రేట్ చేసుకున్నట్టు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. నేపాల్‌లో కూడా ద‌సరా అత్యంత ప‌విత్ర‌మైప పండుగ అని పేర్కొంది. అంతేకాక మ‌నీషా తండ్రి ప్ర‌కాశ్‌, త‌ల్లి సుష్మా కోయిరాలా త‌మ కూతురు,కుమారుడికి బ్లెస్సింగ్స్ ఇస్తున్న ఫోటోలు కూడా షేర్ చేసింది. మ‌నీషా షేర్ చేసిన ఫోటోలు నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.