సోమవారం 01 జూన్ 2020
Cinema - May 21, 2020 , 19:03:55

నేపాల్‌ నిర్ణయానికి మనీషాకొయిరాలా మద్దతు..నెటిజన్ల ఆగ్రహం

నేపాల్‌ నిర్ణయానికి మనీషాకొయిరాలా మద్దతు..నెటిజన్ల ఆగ్రహం

ఖాట్మండ్‌: భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లో ఉన్న మూడు పట్టణాలు (భారతభూగాలు) లిపులేక్‌, కాలాపాని, లింపియాధురా తమవే అంటూ నేపాల్‌ కొత్తమ్యాప్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. నేపాల్ కేబినెట్‌ నిర్ణయానికి ప్రముఖ సినీ నటి మనీషా కొయిరాలా మద్దతు తెలిపింది. లిపులేక్‌, కాలాపాని, లింపియాధురా పట్టణాలు తమవేనంటూ నేపాల్‌ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రదీప్‌ గ్యావాలీ చేసిన ట్వీట్‌ ను మనీషా కొయిరాలా రీట్వీట్‌ చేసింది.

మన చిన్నదేశం స్వాభిమానాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు. ఈ అంశంపై 3 గొప్ప దేశాల మధ్య శాంతియుతంగా గౌరవప్రదమైన చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నానని మనీషా కొయిరాలా ట్వీట్‌ చేసింది. అయితే నేపాల్‌ కేబినెట్‌ నిర్ణయానికి మద్దతు పలుకుతూ మనీషా కొయిరాలా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేపాల్‌ వెళ్లిపోవాలని మనీషా కొయిరాలాకు  నెటిజన్లు చురకలంటిస్తున్నారు.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo