శుక్రవారం 04 డిసెంబర్ 2020
Cinema - Oct 28, 2020 , 14:55:58

9 మంది ద‌ర్శ‌కులు..9 క‌థ‌లు..ఒక్క సినిమా

9 మంది ద‌ర్శ‌కులు..9 క‌థ‌లు..ఒక్క సినిమా

ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం-నెట్‌ఫ్లిక్స్ తో క‌లిసి అరుదైన ప్రాజెక్టును తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. అంథాల‌జీ (కొన్ని క‌థ‌ల స‌మాహారం)గా వ‌స్తోన్న ఈ చిత్రాన్న మ‌ణిర‌త్నం-జ‌యేంద్ర పంచ‌ప‌కేశ‌న్-నెట్ ఫ్లిక్స్ సంయుక్త భాగ‌స్వామ్యంలో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి న‌వ‌ర‌స అనే టైటిల్ ను ఖ‌రారు చేసిన‌ట్టు ఫిల్మ్ క్రిటిక్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ ద్వారా తెలిపారు. 9 మంది ద‌ర్శ‌కులు, 9 క‌థ‌ల‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌డం విశేషం.

ఏఆర్ రెహ‌మాన్, గిబ్రాన్ స‌హా 8 మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నారు. ఈ చిత్రానికికేవీ ఆనంద్‌, గౌత‌మ్ మీన‌న్‌, కార్తీక్ సుబ్బ‌రాజు, బిజోయ్ నంబియార్‌, పొన్ర‌మ్‌, హ‌లిత ష‌మీమ్‌, కార్తీక్ న‌రేన్‌, ర‌తీంద్ర‌న్ ఆర్ ప్ర‌సాద్‌, అర‌వింద్ స్వామి డైరెక్ట‌ర్లుగా ప‌నిచేయ‌నున్నారు. రేవ‌తి, నిత్య‌మీన‌న్‌, ఐశ్వ‌ర్య‌రాజేశ్‌, పూర్ణ‌, రిత్విక‌, పార్వ‌తి, తిరువొతు ఫీమేల్ లీడ్స్ లో న‌టించ‌నుండగా..అర‌వింద్ స్వామి, సూర్య‌, సిద్దార్థ్‌, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్‌, ప్ర‌స‌న్న‌, గౌత‌మ్ కార్తీక్ తోపాటు మ‌రికొంత న‌టులు మేల్ లీడ్స్ లో క‌నిపించ‌నున్నారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.