కారు చీకటి కమ్మిన నింగిలో సూర్యుడేమిటా? అని ఆశ్చర్యపోతున్నారా.. మీరు చూస్తున్నది భాస్కరుడిని కాదు. నిండు జాబిల్లిని. అవును. బుధవారం ‘సూపర్ బ్లడ్ మూన్’ కావడంతో ఢిల్లీలో నెలరాజు ఇలా కనువిందు చేశాడు. అయితే ఇదేరోజు చంద్రగ్రహణం కూడా అయినప్పటికీ, ఆ దృశ్యాలు భారత్లో కనిపించలేదు.