బుధవారం 25 నవంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 11:25:42

చిన్నారిని ద‌త్త‌త తీసుకున్న మందిరా బేడీ

చిన్నారిని ద‌త్త‌త తీసుకున్న మందిరా బేడీ

న‌టిగా, ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా, టెలివిజన్‌ వ్యాఖ్యాత‌గా, క్రికెట్ కామెంటేటర్‌గా ఇలా ప‌లురంగాల‌లో త‌న‌దైన ముద్ర వేసిన హాట్ భామ మందిరా బేడి. బాలీవుడ్ అల్ టైం బ్లాక్ బస్టర్ దిల్ వాలే మూవీతో మందిరా వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన మందిరా  2003, 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్‌ కప్‌ కు వ్యాఖ్యతగా వ్యవహరించి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.   

గ్లామర్‌ ఫీల్డ్ లో కొనసాగుతూనే ఫ్యాషన్ డిజైనర్‌గా మారిన మందిరా 1972 ఏప్రిల్ 14న జ‌న్మించింది. ఫిబ్ర‌వరి 14,1999న రాజ్ కౌష్‌ల్‌ను వివాహ‌మాడాక 2011లో తొలి బిడ్డ‌కు జన్మినిచ్చారు. 2013లో ఆడ‌పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకున్న ఈ జంట తాజాగా తారా బేడి కౌశ‌ల్ అనే నాలుగేళ్ళ చిన్నారిని ద‌త్త‌త తీసుకున్నారు.  సోష‌ల్ మీడియా ద్వారా నాలుగేళ్ళ చిన్నారిని త‌న ఇంట్లోకి స్వాగ‌తం ప‌లికిన‌ట్టు తెలిపింది. అంతేకాదు తారాతో మందిరా ఫ్యామిలీ క‌లిసి దిగిన ఫోటోని కూడా షేర్ చేసింది. జూలై 28,2020న మందిరా బేడీ ఆ చిన్నారికి స్వాగతం ప‌లికిన‌ట్టు మందిరా స్ప‌ష్టం చేసింది.