e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News మోసగాళ్లు 2 డేస్ కలెక్షన్స్.. విష్ణుకు మరో ప్లాప్

మోసగాళ్లు 2 డేస్ కలెక్షన్స్.. విష్ణుకు మరో ప్లాప్

ఇండస్ట్రీలో కొంత మంది వారసులకు కొండంత బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది.. కానీ వాళ్లకు రవ్వంత అదృష్టం ఉండదు. అలాంటి హీరో మంచు విష్ణు. మోహన్ బాబు లాంటి శిఖరం ఇంటి నుంచి వచ్చిన ఈయనకు ఇప్పటి వరకు హీరోగా గుర్తింపు రాలేదు.

కనీసం రూ.10 కోట్ల మార్కెట్ కూడా సంపాదించుకోలేదు విష్ణు. 14 సంవత్సరాల కింద వచ్చిన ఢీ, దాదాపు పదేళ్ల కింద వచ్చిన దేనికైనా రెడీ సినిమాలు తప్పిస్తే ఈయన కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయాలు లేవు.

- Advertisement -

దాంతో కొన్నేళ్లుగా సినిమాలు చేయడమే మానేశాడు విష్ణు. ఈ క్రమంలో ఆయన నుంచి వచ్చిన సినిమా మోసగాళ్లు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ స్కామ్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించాం అని చెప్పాడు విష్ణు.
దానికి తోడు ఈ సినిమాకు కథ కూడా ఆయనే అందించాడు.

హీరోయిన్ కాజల్ ఈ సినిమాలో విష్ణు అక్కగా నటించింది. హాలీవుడ్ నుంచి జెఫ్రీ అనే దర్శకుడిని తీసుకొచ్చి ఈ సినిమా చేశాడు విష్ణు.

కాస్టింగ్ దగ్గర కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర.. ఇలా చాలా మందిని మోసగాళ్లు సినిమాలో తీసుకున్నాడు విష్ణు.

ఖచ్చితంగా ఇది తన కెరీర్‌ను మలుపుతిప్పే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పాడు.

కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌

తన మార్కెట్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని తెలిసినా కూడా.. 50 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా మోసగాళ్లు సినిమాను నిర్మించానని ప్రమోషన్ కార్యక్రమాల్లో చెప్పాడు మంచు విష్ణు.

మార్చి 19 న విడుదలైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. వసూళ్ల‌ విషయానికి వస్తే కనీస కలెక్షన్లు కూడా రాలేకపోయాయి.

సినిమాలో అంతమంది స్టార్ కాస్ట్ ఉండి కూడా తొలి రోజు కేవలం రూ.42 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది మోసగాళ్లు.

ఇక రెండో రోజు వసూళ్లు సగానికి పడిపోయాయి. కేవలం రూ.20 లక్షల షేర్ మాత్రమే రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసింది ఈ సినిమా.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచు విష్ణు మోసగాళ్లు సినిమాను సొంతంగా విడుదల చేసుకున్నాడు.

దాదాపు 20 కోట్ల షేర్ వసూలు చేస్తే కానీ ఇది బ్రేక్ ఈవెన్ కాదు.

ఇలాంటి పరిస్థితుల్లో సినిమా కోటి రూపాయలు వసూలు చేయడం కూడా కష్టంగా మారిపోయింది. దాంతో విష్ణుకు మరోసారి నిరాశ తప్పేలా లేదు.

ఇవి కూడా చ‌దవండి..

నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ

అక్క‌డ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్

జ‌ల‌పాతంలా హంసానందిని న‌య‌గారాలు

పింక్ రీమేక్‌కు ‘వ‌కీల్‌సాబ్’ టైటిల్ అనుకోలేద‌ట‌..!

ఫేక్ అకౌంట్స్ న‌మ్మోద్దంటూ వైష్ణ‌వ్ తేజ్ ప్ర‌క‌ట‌న‌

గ్లామర్‌ పాత్రలకు ఓకే!

కీర్తి సురేష్ కనిపించట్లేదంటూ నితిన్ ట్వీట్.. పోలీసుల రిప్లై..

తమన్నా ఇంటిని చూస్తారా.. ఇంధ్రభవనం కూడా తక్కువే..

సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు 60 రోజుల మాస్టర్ ప్లాన్

ఈ వారం బ్యాడ్ ఫ్రైడే.. అన్ని సినిమాలు డీప్ ఫ్రై..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement