శనివారం 30 మే 2020
Cinema - May 19, 2020 , 21:37:55

బర్త్‌ డే వేడుకలకు దూరంగా మంచు మనోజ్‌

బర్త్‌ డే వేడుకలకు దూరంగా మంచు మనోజ్‌

కరోనా వైరస్‌ తో లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో పుట్టినరోజు వేడుకులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు టాలీవుడ్‌ యాక్టర్‌ మంచు మనోజ్‌ ప్రకటించాడు. ట్విట్టర్‌ లో ఈ మేరకు మనోజ్‌ ఓ పోస్ట్‌ పెట్టాడు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది బర్త్‌ డే జరుపుకోవద్దని నిర్ణయించుకున్నా.

లాక్‌డౌన్‌తో చిక్కుకున్న వలసకార్మికులకు నా వంతుగా సాయం చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. రాష్ట్రంలో అక్కడకక్కడా చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తానని ట్వీట్‌ చేశాడు. తన వంతు ప్రయత్నం విజయవంతం కావాలని అందరూ దీవెనలు అందించాలని మనోజ్‌ కోరాడు. అందరికీ నమస్కారం..ఓ పోస్ట్‌ను పెట్టాడు. ఈ కరోనా మనం కొద్ది రోజుల్లో దాటేస్తాం. అందరం బాగుంటాం. అంతా బాగుంటుంది అని ఆకాంక్షించాడు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు.


logo