శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 04, 2020 , 23:31:24

రౌద్రం శాంతం హాస్యం

రౌద్రం శాంతం హాస్యం

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాతో హీరోగా పునరాగమనం చేస్తున్నారు మంచు మనోజ్‌.  శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం ఆర్ట్స్‌ బ్యానర్‌పై నిర్మలాదేవి మంచు, మనోజ్‌ మంచు నిర్మిస్తున్నారు. బుధవారం ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో నుదుటిపై విభూది నామాలతో నిలువు తిలకం ధరించి మూడు భిన్న గెటప్‌లలో మనోజ్‌ కనిపిస్తున్నారు. పొడవైన గడ్డం, మెలి తిరిగిన మీసకట్టుతో హాస్యం,  రౌద్రం, శాంతంతో కూడిన హావభావాలతో ఆయన లుక్‌ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియన్‌ సినిమాగా రూపొందించనున్నారు.  క్రైమ్‌ కామెడీ యాక్షన్‌ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నది. ఈ నెల 6న ఈ సినిమా ప్రారంభంకానున్నది.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి, సంగీతం: అచ్చు రాజమణి, రమేష్‌ తమిళమణి, స్టంట్స్‌: పీటర్‌ హెయిన్‌ర.


logo