మంగళవారం 04 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 08:42:37

ఎన్టీఆర్‌తో ఢీ అంటున్న మంచు మ‌నోజ్‌..!

ఎన్టీఆర్‌తో ఢీ అంటున్న మంచు మ‌నోజ్‌..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి  ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ వ‌ల‌న ఈ చిత్ర షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ ప‌డ‌గా, మ‌రికొద్ది రోజుల‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌ర‌గ‌నుంది. అయితే ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌న 30వ సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి ‘అయినను పోయిరావలె హస్తినకు’ ప‌రిశీలిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తోన్న ఈ చిత్రంలో విలన్‌గా మంచు మనోజ్‌ను తీసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరుగుతోంది.

త‌న ప్ర‌తి చిత్రంలో పాత్ర‌ల ఎంపికలో ప్ర‌త్యేక శైలిని కన‌బ‌రుస్తున్న త్రివిక్ర‌మ్ త‌న తాజా చిత్రంలో ఎన్టీఆర్‌కి విల‌న్‌గా మ‌నోజ్ అయితే స‌రిగ్గా స‌రిపోతాడని భావిస్తున్నాడ‌ట‌. ఎన్టీఆర్ కూడా ఈ విష‌యంలో పాజిటివ్‌గానే ఉన్న‌ట్టు తెలుస్తుంది. అతి త్వ‌ర‌లోనే దీనిపై ఓ క్లారిటీ అయితే రానుంది. మ‌రోవైపు, మంచు మనోజ్ చాలా కాలం తరవాత మళ్లీ వెండితెరపై మెరవబోతున్నారు. ఎంఎం ఆర్ట్స్ పేరిట సొంతంగా నిర్మాణ సంస్థను ఏర్పాటుచేసుకున్న మనోజ్.. ఈ బ్యానర్‌లో మొదటి సినిమాగా ‘అహం బ్రహ్మాస్మి’ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 2017లో వచ్చిన ‘ఒక్కడు మిగిలాడు’ సినిమా తరవాత మళ్లీ మంచు మనోజ్ హీరోగా వస్తోన్న చిత్రం ‘అహం బ్రహ్మాస్మి’. logo