శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 07, 2020 , 11:20:04

నీ బ్యాంక్ డీటైల్స్ పంపు త‌మ్ముడు : మ‌ంచు ల‌క్ష్మీ

నీ బ్యాంక్ డీటైల్స్ పంపు త‌మ్ముడు : మ‌ంచు ల‌క్ష్మీ

లాక్‌డౌన్ కారణంగా ఇంటికే ప‌రిమిత‌మైన సెల‌బ్రిటీలు ఖాళీ స‌మ‌యాల‌లో సోష‌ల్ మీడియా వేదిక‌గా నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టిస్తున్నారు. కొందరు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అడుగుతుండ‌గా, మ‌రికొంద‌రు చిలిపి ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. దీనికి సెల‌బ్రిటీలు కూడా త‌మదైన స్టైల్‌లో పంచ్‌లు వేస్తున్నారు.

మంచు ల‌క్ష్మీ కొద్ది సేప‌టి క్రితం నెటిజ‌న్స్‌తో ముచ్చ‌టించ‌సాగింది. ఇందులో ఓ నెటిజ‌న్ మీ నెట్‌ఫ్లిక్స్ అకౌంట్ షేర్ చేయ్ అక్కా అని కామెంట్ పెట్టాడు. దీనికి త‌న‌దైన శైలిలో స్పందించిన మంచు వార‌మ్మాయి .. నీ బ్యాంక్ డీటైల్స్ పంపు త‌మ్ముడు, నేను ఆన్‌లైన్ షాపింగ్ చేసుకుంటాను అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo