గురువారం 28 మే 2020
Cinema - May 12, 2020 , 15:13:34

ప‌వ‌న్ స‌ర‌స‌న మ‌ల‌యాళీ బ్యూటీ..!

ప‌వ‌న్ స‌ర‌స‌న మ‌ల‌యాళీ బ్యూటీ..!

వ‌కీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఏడాది త‌న అభిమానుల‌కి ప‌సందైన వినోదాన్ని అందించాల‌ని భావించాడు. కాని లాక్‌డౌన్ వ‌ల‌న ప‌వ‌న్ మూవీ రిలీజ్‌పై సందిగ్ధం నెల‌కొంది. వ‌కీల్ సాబ్ త‌ర్వాత ప‌వ‌న్ న‌టించ‌బోయే సినిమాలు కూడా ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. క్రిష్‌తో ప‌వ‌న్ 27వ సినిమా తెర‌కెక్క‌నుండ‌గా, 28వ సినిమా హ‌రీష్ శంక‌ర్ తెర‌కెక్కించ‌నున్నాడు. 

ప‌వ‌న్ - హ‌రీష్ శంకర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌బోవు సినిమాకి సంబంధించి ఒక్కో అప్ డేట్ వ‌స్తుంది. రీసెంట్‌గా చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తార‌ని హ‌రీష్ శంక‌ర్ ప్ర‌క‌టించ‌గా, ఇప్పుడు హీరోయిన్ మ‌ల‌యాళ భామ మానస రాధాకృష్ణన్ అని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ సినిమాతో అమ్మ‌డు తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానుంది. కేరళలో పుట్టిన ఈ సుందరి, దుబాయ్ లో పెరిగింది.  ఇంతవరకూ 10 మలయాళ చిత్రాలలో నటించిన మానస రాధాకృష్ణన్, తెలుగులో పవన్ కల్యాణ్ జోడీగా న‌టిస్తుంద‌నే విష‌యంలో క్లారిటీ రావ‌ల‌సి ఉంది. ప్రస్తుతం ఆమె  మలయాళంలో 'పరమగురు' సినిమా చేస్తోంది 


logo