గురువారం 04 మార్చి 2021
Cinema - Jan 28, 2021 , 09:13:44

వార్త‌ల‌లోకి మ‌నం 2.. ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్న ఫ్యాన్స్

వార్త‌ల‌లోకి మ‌నం 2.. ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్న ఫ్యాన్స్

అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి మూడు త‌రాల న‌టులు మ‌నం అనే చిత్రంలో క‌లిసి న‌టించి ప్రేక్ష‌కుల‌కు పసందైన వినోదం అందించిన విష‌యం తెలిసిందే. గ‌తంలో  క‌పూర్ ఫ్యామిలీ లో ఇలా మూడు త‌రాల న‌టులు క‌లిసి న‌టించ‌గా, ఆ త‌ర్వాత అక్కినేని ఫ్యామిలీనే ఇలాంటి ప్రయోగం చేసింది. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన మ‌నం చిత్రంలో  అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, నాగార్జున‌, చైత‌న్య‌, అఖిల్ క‌లిసి న‌టించారు. ఈ చిత్రం క్లాసిక్ మూవీగా నిలిచింది.

మ‌నం చిత్రానికి సీక్వెల్‌గా ఓ మూవీ తెర‌కెక్కించాల‌ని విక్ర‌మ్ కుమార్ ఎప్ప‌టి నుండో ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ప్ప‌టికీ, అది వ‌ర్కవుట్ కావ‌డం లేదు. అయితే తాజాగా త‌న‌కు వ‌చ్చిన మంచి ఐడియాను విక్ర‌మ్.. నాగార్జున ముందు పెట్ట‌డంతో దానికి ఆయ‌న  ఫుల్ ఫిదా అయ్యాడ‌ట‌. దీంతో మ‌నం 2 ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే ప‌నిలో విక్ర‌మ్ కుమార్ ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఈ సారి అమ‌ల‌, సుశాంత్‌, సుమంత్‌ల‌ను కూడా ఈ చిత్రంలో న‌టింప‌జేసేలా విక్ర‌మ్ స్క్రిప్ట్ రూపొందిస్తున్న‌ట్టు టాక్.ఇదే క‌నుక జ‌రిగితే ప్రేక్ష‌కుల‌కు ఈ చిత్రం క‌నుల‌పండుగ‌గా మార‌డం ఖాయం.

VIDEOS

logo