గురువారం 26 నవంబర్ 2020
Cinema - Oct 26, 2020 , 18:46:37

వ్య‌క్తిని హ‌త్య చేసి కాల్వ‌లో ప‌డేసిన దుండ‌గులు

వ్య‌క్తిని హ‌త్య చేసి కాల్వ‌లో ప‌డేసిన దుండ‌గులు

సంగారెడ్డి: స‌ంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు మండ‌లం భానూర్ లో దారుణం వెలుగుచూసింది. గుర్తు తెలియ‌ని దుండ‌గులు స‌త్య‌నారాయ‌ణ అనే వ్య‌క్తిని హ‌త్య చేసి కాల్వ‌లో ప‌డేశారు. త‌న భ‌ర్త‌ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు బెదిరించి హ‌త్య చేశార‌ని మృతుని భార్య ఆరోపిస్తుంది. అయితే భార్య  హ‌త్య చేయించింద‌ని స‌త్య‌నారాయ‌ణ కుటుంబ‌స‌భ్యులు ఆరోపిస్తున్నారు. స‌త్య‌నారాయ‌ణ మృత‌దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. స‌త్య‌నారాయ‌ణను హ‌త్య చేశారా..? హ‌త్య చేయించారా..? ఈ ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాల‌పై ప‌లు కోణాల్లో పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.