బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 06, 2020 , 18:02:53

150 రోజులుగా ఇంట్లోనే ఉన్న స్టార్ హీరో

150 రోజులుగా ఇంట్లోనే ఉన్న స్టార్ హీరో

గ‌తేడాది యాత్ర సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు మ‌ల‌యాళ స్టార్ హీరో మ‌మ్ముట్టి. ఈ సినిమాలో వైఎస్సార్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించాడు.  క‌రోనా నేప‌థ్యంలో లాక్ డౌన్ ఎఫెక్ట్ తో చాలా కాలంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యాడట మ‌మ్ముట్టి. ఈ విష‌యాన్ని మ‌మ్ముట్టి కుమారుడు దుల్హ‌ర్ స‌ల్మాన్ చెప్పాడు.  

మ‌మ్ముట్టి 150 రోజుల‌పాటు ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాకుండా..వ్యక్తిగ‌తంగా రికార్డును సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. రోడ్ ట్రిప్ కు వెళ్దామ‌ని దుల్హ‌ర్ స‌ల్మాన్ మ‌మ్ముట్టిని అడిగాడ‌ట‌. అయితే మ‌మ్ముట్టి మాత్రం తాను ఇలా ఎన్ని రోజులు ఇలా ఇంటిప‌ట్టునే ఉండ‌గ‌లుగుతానో చూస్తాన‌ని ఛాలెంజ్ గా తీసుకున్న‌ట్టు చెప్పాడు. ఆయ‌న ఇలా ప్ర‌తీసారి ఏదో ఒక ఛాలెంజ్ తీసుకుంటాడ‌ని చెప్పాడు. క్వారంటైన్ టైంలో త‌న హాబీ అయిన ఫొటోగ్ర‌ఫీపై దృష్టి పెడుతున్నాన‌ని మ‌మ్ముట్టి గ‌తంలో చెప్పిన విష‌యం తెలిసిందే.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo