మంగళవారం 11 ఆగస్టు 2020
Cinema - Jul 07, 2020 , 08:59:09

వంటింటి చిట్కాతో క‌రోనాని అడ్డుకోవొచ్చంటున్న బాలీవుడ్ బ్యూటీ

వంటింటి చిట్కాతో క‌రోనాని అడ్డుకోవొచ్చంటున్న బాలీవుడ్ బ్యూటీ

క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండవం చేస్తుంది. రోజురోజుకి క‌రోనా బాధితుల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో  సామాన్యులు, సెల‌బ్రిటీలు తెగ భ‌య‌ప‌డిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ బ్యూటీ మ‌లైకా అరోరా వంటింటి చిట్కాతో క‌రోనాని క‌ట్ట‌డి చేయ‌వ‌చ్చ‌ని వీడియో ద్వారా చెబుతుంది.

ప‌సుపు, ఆపిల్‌, అల్లం, వెనిగ‌ర్‌, పెప్ప‌ర్‌ని ఉప‌యోగించి త‌యారు చేసుకున్న క‌షాయం తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది మ‌లైకా అరోరా చెబుతుంది. ఈ చిట్కా పాటిస్తే క‌రోనా నుండి మ‌నం సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం మేము ఈ చిట్కాని పాటిస్తున్నాం అంటూ మలైకా చెప్పుకొచ్చింది. మ‌లైకా వంటింటి చిట్కాపై  నెటిజ‌న్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.


logo