శనివారం 24 అక్టోబర్ 2020
Cinema - Oct 16, 2020 , 18:36:58

దృశ్యం 2 లొకేష‌న్ వీడియో షేర్ చేసిన మోహ‌న్ లాల్‌

దృశ్యం 2 లొకేష‌న్ వీడియో షేర్ చేసిన మోహ‌న్ లాల్‌

మోహ‌న్ లాల్‌, మీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌చ్చిన దృశ్యం చిత్రానికి సీక్వెల్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. డైరెక్ట‌ర్ జీతూ జోసెఫ్ ఆరేళ్ల‌ బ్రేక్ త‌ర్వాత సీక్వెల్ కు శ్రీకారం చుట్టారు. ఇటీవ‌లే మోహ‌న్ లాల్‌, మీనా, అన్సిబా, ఈస్త‌ర్లు సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యారు. అయితే తాజాగా మోహ‌న్ లాల్ షూటింగ్ లొకేష‌న్ వీడియోను ట్విట‌ర్ ద్వారా షేర్ చేశాడు. దృశ్యం 2 లొకేష‌న్ వీడియోలో మోహ‌న్ లాల్ కంప్లీట్ బ్లాక్ ఔట్ ఫిట్ లో క‌నిపిస్తున్నాడు. ఈ వీడియో ఇపుడు ఆన్ లైన్ లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

జీతు జోసెఫ్. సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం చుట్టూ తిరిగే కథాంశంతో దృశ్యం ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ను తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. దృశ్యం చిత్రాన్ని హిందీ లో అజ‌య్ దేవ్‌గ‌న్, శ్రియ కాంబినేష‌న్ లో రీమేక్ చేయ‌గా..తెలుగులో వెంక‌టేశ్-మీనా కాంబినేష‌న్ లో రీమేక్ చేశారు. అన్ని భాష‌ల్లో మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo