శనివారం 16 జనవరి 2021
Cinema - Nov 25, 2020 , 16:30:17

ఆస్కార్ బ‌రిలో 'జ‌ల్లిక‌ట్టు'

ఆస్కార్ బ‌రిలో 'జ‌ల్లిక‌ట్టు'

ఆస్కార్స్ -2021 ఎంట్రీస్ లో మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం జ‌ల్లిక‌ట్టు చోటు సంపాదించింది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఫీచ‌ర్ ఫిలిం కేట‌గిరీలో 93వ అకాడ‌మీ అవార్డ్స్ లో ఇండియా నుంచి చోటు ద‌క్కించుకున్న చిత్రంగా  'జ‌ల్లిక‌ట్టు' నిలిచింది. హ‌రీస్ క‌థనందించిన ఈ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరి  ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.  త‌మిళ‌నాడులో వివాదాస్ప‌ద సంప్ర‌దాయ‌ బుల్ టేమింగ్ స్పోర్ట్  ఆధారంగా సాగే జ‌ల్లిక‌ట్టు చిత్రంలో ఆంటోనీ వ‌ర్గీస్‌, చెంబ‌న్ వినోద్ జోస్‌, స‌బుమోన్ అబ్దుస‌మ‌ద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 

మొత్తం ఆస్కార్స్ బ‌రిలో హిందీ, మ‌ల‌యాళం, ఒరియా, మ‌రాఠి భాష‌ల నుంచి 27 సినిమాలు నిలిచాయి. మ‌నుషులు, జంతువుల మ‌ధ్య బావోద్వేగ పూరిత స‌న్నివేశాల‌ను కండ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించిన జ‌ల్లిక‌ట్టు భార‌తదేశం గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రాల్లో ఒకటి. ఈ కార‌ణంగా భార‌త్ నుంచి జ‌ల్లిక‌ట్టును జ్యూరీ నామినేట్ చేసింద‌ని ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డు ఛైర్మ‌న్ రాహుల్ ర‌వైల్ తెలిపారు.  

2019 సెప్టెంబ‌ర్ 6న టొరంటో ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో జ‌ల్లిక‌ట్టు‌ను  ప్ర‌ద‌ర్శించగా..అద్భుత‌మైన ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అంతేకాదు ఈ చిత్రానికి లిజో జోస్ ఉత్త‌మ డైరెక్ట‌ర్ ట్రోపీ కూడా అందుకున్నాడు. ఛాలాంగ్‌, శకుంతాలాదేవి, గుంజన్ స‌క్సేనా, ఛపాక్‌, గులాబో సితాబో హిందీ చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.