గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 07, 2020 , 10:32:08

ప్రియుడు నుండి స్టార్ హీరోయిన్‌కు క‌రోనా..!

ప్రియుడు నుండి స్టార్ హీరోయిన్‌కు క‌రోనా..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా కరోనా బారిన ప‌డ్డారు. అర్జున్ క‌పూర్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన కొద్ది గంట‌ల‌లోనే మలైకాకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. ఈ విష‌యాన్ని మలైకా సోద‌రి ముందుగా క‌న్‌ఫాం చేయ‌గా, ఆ త‌ర్వాత మ‌లైకా కూడా నిర్ధార‌ణ చేసింది. అవును, నాకు పాజిటివ్ అని నిర్ధార‌ణ అయింది. ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవు. స్వీయ నిర్భందంలో ఉన్నాను. త్వ‌ర‌లోనే కోలుకొని మ‌ళ్ళీ మీ ముందుకు వ‌స్తా అని చెప్పుకొచ్చింది.

కొద్ది కాలంగా అర్జున్ కపూర్, మలైకా అరోరా ప్రేమ‌లో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. పెళ్ళిపై ఆస‌క్తి చూప‌ని వీరు స‌హ‌జీవ‌నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే  ఇద్దరికి ఒకే సారి కరోనా పాజిటివ్ వచ్చింది అంటే  వీరిద్దరు ఖచ్చితంగా కలిసే ఉంటున్నారు అనే అనుమానం జ‌నాల‌లో క‌లుగుతుంది.  మలైకా కంటే వయసులో చిన్న అయిన అర్జున్ కపూర్ హీరోగా కెరీర్ ఏమాత్రం సరిగా లేదు. ఇలాంటి సమయంలో ఆమె ప్రేమలో మునిగి తేలుతు కెరీర్ విషయంలో అశ్రద్ద చేస్తున్నాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  logo