ఆదివారం 09 ఆగస్టు 2020
Cinema - Jul 03, 2020 , 18:41:25

మలైకా అరోరా త్రోబ్యాక్ సెల్ఫీ

మలైకా అరోరా త్రోబ్యాక్ సెల్ఫీ

బాలీవుడ్ తార మలైకాఅరోరా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఎప్పుటికపుడు ఫిట్ నెస్ వర్కవుట్స్, డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఈ భామ తాజాగా త్రోబ్యాక్ సెల్ఫీ ఒకటి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. బీటౌన్ కోస్టార్స్ కరీనాకపూర్, కరీష్మాకపూర్, సోదరి అమృతా అరోరా, డిజైనర్ మల్లికా భట్ అంతా కలిసి ఒక్క చోట సందడి చేశారు. అదే సమయంలో అందరూ సెల్పీ  దిగారు. ఈ సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. 

మలైకా ప్రస్తుతం కుమారుడు అర్హాన్ ఖాన్ తో ముంబై నివాసంలో క్వారంటైన్ లో ఉంది. అందమైన రేపటి రోజును చూడాలంటే..ఇవాళ అప్రమత్తంగా ఉండటం అవసరం. మన ఆరోగ్యం, మనకు ఇష్టమైన వారిని జాగ్రత్తగా చూసుకుందాం. అంటూ కొడుకు అర్హాన్ తో కలిసి ఇప్పటికే ఓ ఫొటోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo