బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 03, 2020 , 11:16:20

లాక్‌డౌన్ స‌మ‌యంలో ల‌డ్డూలు చేస్తున్న హాట్ బ్యూటీ

లాక్‌డౌన్ స‌మ‌యంలో ల‌డ్డూలు చేస్తున్న హాట్ బ్యూటీ

బాలీవుడ్ హాట్ బ్యూటీ మ‌లైకా అరోరా నాలుగు ప‌దుల వ‌య‌సులోను కుర్ర‌కారు మ‌తులు పోగొడుతోంది. ప్ర‌స్తుతం అర్జున్ క‌పూర్‌తో ప్రేమాయ‌ణంలో ఉన్న ఈ అమ్మ‌డు ఏదో ఒక విష‌యంతో త‌ర‌చూ వార్త‌లలో నిలుస్తూ  ఉంటుంది. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన ఈ అమ్మడు తీరిక‌గా ల‌డ్డూలు త‌యారు చేస్తుంది.

లడ్డూల త‌యారీ గురించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది 46 ఏళ్ల మ‌లైకా. ఇందులో వంటింట్లో కూర్చొని పొద్దిక‌గా ల‌డ్డూలు త‌యారు చేస్తుండ‌డాన్ని చూసి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. ఈ హాట్ బ్యూటీలో ఇలాంటి యాంగిల్ కూడా దాగి ఉందా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. నిత్యం షూటింగ్‌లతో బిజీగా ఉండే సెలబ్రిటీలు లాక్‌డౌన్‌ వల్ల ప్రస్తుతం ఇంట్లో  వంట చేయడం, వర్కవుట్‌లు, ఇంటిని శుభ్రపరచడం, నిద్రించడం, కుటుంబంతో గడపడం వంటివి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo