e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News ఇది మ‌లైకా నిశ్చితార్థ‌పు ఉంగ‌ర‌మా?.. అభిమానుల్లో అనేక అనుమా‌నాలు

ఇది మ‌లైకా నిశ్చితార్థ‌పు ఉంగ‌ర‌మా?.. అభిమానుల్లో అనేక అనుమా‌నాలు

ఇది మ‌లైకా నిశ్చితార్థ‌పు ఉంగ‌ర‌మా?.. అభిమానుల్లో అనేక అనుమా‌నాలు

గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న కెవ్వు కేక అనే పాట‌కు స్టెప్పులేసి తెలుగు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ మ‌లైకా అరోరా ఖాన్. ఈ అమ్మ‌డు సినిమాల క‌న్నా వివాదాల‌తోనే ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ ఉంటుంది. కొన్నాళ్ల క్రితం త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చిన మ‌లైకా ప్ర‌స్తుతం బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ క‌పూర్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతుంది. వీరిద్ద‌రు క‌లిసి తిర‌గ‌డం, చెట్టాప‌ట్టాలు వేయ‌డం వంటివి మీడియా ముఖంగానే చేశారు.

త్వ‌ర‌లోనే మ‌లైకా, అర్జున్ క‌పూర్‌లు పెళ్లి క‌పూర్‌లు పెళ్లి పీట‌లెక్క‌నున్నార‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో మ‌లైకా రీసెంట్‌గా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో చేతికి డైమండ్ రింగ్ ధ‌రించిన ఫొటోలు షేర్ చేసింది. దీంతో అంద‌రు ఆమెకు అర్జున్ క‌పూర్‌తో నిశ్చితార్థం అయింద‌ని అనుకున్నారు. కాని అస‌లు విష‌యం ఏంటంటే ఓ జ్యువెల‌రీ బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేసే క్ర‌మంలో రింగ్ ధ‌రించి ఫొటోల‌కు ఫోజులిచ్చింది. జీవితంలో ముఖ్య‌మైన ఘ‌ట్టం ఆరంభించబోతున్నారా, అయితే ఈ నిశ్చితార్థ‌పు ఉంగ‌రాలు అందుకు స‌రిగ్గా స‌రిపోతాయి అని కామెంట్ పెట్టింది. ప్రస్తుతం మలైకా ‘ఇండియాస్‌ బెస్ట్‌ డ్యాన్సర్‌’ అనే రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది.

Advertisement
ఇది మ‌లైకా నిశ్చితార్థ‌పు ఉంగ‌ర‌మా?.. అభిమానుల్లో అనేక అనుమా‌నాలు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement