బుధవారం 23 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 01:30:00

మహ విలనిజం

మహ విలనిజం

గతకొన్నేళ్లుగా గ్లామర్‌ పాత్రలకు దూరంగా ఉంటున్న హన్సిక నటనకు ఆస్కారమున్న పాత్రలపై దృష్టిపెడుతున్నది. ఆమె కథానాయికగా నటిస్తున్న యాభయ్యవ చిత్రం ‘మహ’. జమీల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హన్సిక జన్మదినం సందర్భంగా ఆదివారం చిత్రబృందం ఆమె కొత్త పోస్టర్‌ను  అభిమానులతో పంచుకున్నది. రక్తంతో తడిసిన చేతులను ముఖానికి అడ్డుపెట్టుకొని ఈ పోస్టర్‌లో హన్సిక కనిపిస్తోంది. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హన్సిక ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో కనిపించనుంది. డబ్బుల కోసం వివిధ అవతారాలు ఎత్తే క్రిమినల్‌గా ఆమె కనిపించబోతున్నట్లు చిత్రబృందం చెబుతోంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా తాను కనిపిస్తానని, కెరీర్‌లోనే విభిన్నమైన సినిమాగా మిగిలిపోతుందని హన్సిక చెప్పింది. ఆమె మాజీ ప్రియుడు శింబు ఈ సినిమాలో కీలక అతిథి పాత్రలో కనిపించబోతున్నారు.logo