సోమవారం 25 మే 2020
Cinema - May 22, 2020 , 23:07:29

కరోనా యోధులకు సలామ్‌

కరోనా యోధులకు సలామ్‌

కరోనా వ్యాప్తి నిర్మూలకు పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి రాజీలేని పోరాటం చేస్తున్నారు. వారి సేవలను కొనియాడుతూ చక్రి సోదరుడు మహిత్‌ నారాయణ్‌ ఓ గీతాన్ని స్వరపరిచారు.  ఈ పాటను తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ గీతానికి బాలాజీ సాహిత్యాన్ని సమకూర్చగా గాయనీగాయకులు మనో, టిప్పు, శ్రీకృష్ణ, సాయిచరణ్‌, నిహాల్‌, గీతా మాధురి, ఆదర్శిని, అంజనా సౌమ్య, హరిణి, బేబీ ఆలపించారు.   ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ‘మహిత్‌ సంగీతం, బాలాజీ రచన, గాయనీగాయకులు పాటను పాడిన తీరు అన్ని బాగున్నాయి. పోలీసులు, డాక్టర్ల సేవలను గుర్తిస్తూ పాట రాయడం స్ఫూర్తినిచ్చింది’ అని తెలిపారు. మహిత్‌ నారాయణ్‌ మాట్లాడుతూ  ‘ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ముందుండి పోరాడుతున్న వారి సేవలకు ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కాలి. ఈ పాటను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆవిష్కరించడం ఆనందంగా ఉంది.  నా మిత్రుల సహకారంతో ఈ పాటకు  స్వరాల్ని అందించగలిగాను’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.


logo