ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 09, 2020 , 16:40:27

మహేశ్‌బాబు బర్త్‌డే ట్రెండ్‌.. 32 మిలియన్లు దాటిన ట్వీట్లు

మహేశ్‌బాబు బర్త్‌డే ట్రెండ్‌.. 32 మిలియన్లు దాటిన ట్వీట్లు

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు  పుట్టినరోజును ఆయన అభిమానులు ఒక రేంజ్‌లో జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న రికార్డులన్నింటినీ దుమ్ము దులిపారు. #HBDMaheshBabu హ్యాష్‌ ట్యాంగ్‌ ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది. ఇప్పటికే ట్వీట్ల సంఖ్య 32 మిలియన్లు దాటగా రాత్రి వరకు వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మహేశ్‌బాబుకు సోషల్ మీడియాలో అద్భుతమైన క్రేజ్ ఉంది. 32 మిలియన్లకు పైగా ట్వీట్లతో ఆయన అభిమానులు తమ రికార్డులను మెరుగుపర్చుకుంటూ కొత్త బెంచ్ మార్కును సృష్టిస్తున్నారు. 

మహేశ్‌ లేటెస్ట్‌ మూవీ సర్కారు వారీ పాట నుంచి మోషన్ పోస్టర్ ఈ రోజు విడుదలైంది. ఇది కూడా ప్రస్తుతం అన్నింటిలో ట్రెండింగ్‌లో ఉంది.  ఈ చిత్రానికి పరుశురాం దర్శకుడు కాగా తమన్‌ సంగీతం అందిస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టిన వెంటనే సూపర్ స్టార్ ఈ చిత్రం సెట్స్‌లో చేరనున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo