ఆదివారం 25 అక్టోబర్ 2020
Cinema - Oct 08, 2020 , 12:38:01

ఎయిర్ ఫోర్స్ డే: శుభాకాంక్ష‌లు తెలిపిన మ‌హేష్‌

ఎయిర్ ఫోర్స్ డే: శుభాకాంక్ష‌లు తెలిపిన మ‌హేష్‌

గ‌గ‌న‌త‌లం నుండి దేశాన్ని సుర‌క్షితంగా ర‌క్షిస్తున్న భారత వాయుసేన ఆవిర్భవించి నేటికి 88 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా భార‌తదేశ ప్రధాని న‌రేంద్ర మోదీతో పాటు ప‌లువురు  ప్ర‌ముఖులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారియర్స్‌కు  శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో స‌వాళ్ళ‌ను ఎదుర్కొంటూ, విపత్తులు సంభవించిన సమయంలో అంకితభావంతో శౌర్యాన్ని ప్రదర్శిస్తూ ధైర్యంగా పనిచేస్తున్న మీ సేవ‌లు ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తాయ‌ని చెబుతున్నారు.

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కూడా జాతీయ వైమానిక దళ దినోత్సవం సంద‌ర్భంగా ధైర్య‌వంతులైన‌ వాయిసేన సిబ్బందికి వంద‌నం తెలిపారు. జాతీయ భ‌ద్ర‌త‌ను ప‌రిర‌క్షించేందుకు ప‌నిచేస్తున్న సైనికులంద‌రికి రుణ‌ప‌డి ఉన్నాం అని త‌న ట్వీట్‌లో తెలిపారు. కాగా, ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న మ‌హేష్ చివ‌రిగా స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీస‌ర్‌గా క‌నిపించారు.


logo