శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 11:15:21

కీర్తి సురేష్ బ‌ర్త్‌డే.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మ‌హేష్‌

కీర్తి సురేష్ బ‌ర్త్‌డే.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన మ‌హేష్‌

మ‌హాన‌టి చిత్రంతో నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. ఈ రోజు ఆమె 28వ పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కీర్తి పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ మహేష్‌ బాబు ఆమెకు స్పెషల్ విషెస్‌ని చెప్పి, సర్కారు వారి పాటలోకి ఆహ్వానించారు.

సూప‌ర్ టాలెంటెడ్‌ కీర్తికి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు. నిన్ను సర్కారు వారి పాటలోకి టీమ్ ఆహ్వానిస్తోంది. నీ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఇది ఒకటిగా నిలుస్తుంది అని నేను భావిస్తున్నాను అని  మహేష్ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన కీర్తి సురేష్‌.. థ్యాంక్యూ సో మ‌చ్ మ‌హేష్ బాబు స‌ర్.. మొదటిసారి మీతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది .ఆ క్ష‌ణం కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని తెలిపింది.  స‌ర్కారు వారి పాట చిత్రాన్ని ప‌ర‌శురాం తెర‌కెక్కించనుండ‌గా,  ఈ చిత్రం షూట్ వచ్చే నవంబర్ లో మొదలు కానుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు . మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సహా మహేష్ లు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం కీర్తి సురేష్ మిస్ ఇండియా, రంగ్ దే అనే చిత్రాలు చేస్తుండ‌గా ఈ మూవీ టీం కూడా  మ‌లయాళ బ్యూటీకి బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేసింది.