సోమవారం 26 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 13:02:18

నా ఫేవ‌రేట్ ద‌ర్శకుడు పూరీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు: మ‌హేష్‌

నా ఫేవ‌రేట్ ద‌ర్శకుడు పూరీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు: మ‌హేష్‌

పోకిరి సినిమాతో సూపర్ స్టార్ మ‌హేష్ బాబు రేంజ్‌ని పెంచేసిన డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్‌తో కలిసి బిజినెస్ మెన్ అనే చిత్రం చేశాడు పూరీ. ఈ మూవీ కూడా మంచి విజ‌యం సాధించింది. క‌ట్ చేస్తే  పూరీ జ‌గ‌న్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రం మ‌హేష్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందించాల‌ని ప్లాన్ చేశాడు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల‌న అది వ‌ర్కవుట్ కాలేదు. ఈ సినిమా విష‌యంలోనే మ‌హేష్‌, పూరీల మ‌ధ్య డిస్టెన్స్ కూడా పెరిగింద‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

ఈ రోజు పూరీ జ‌గ‌న్నాథ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా  స్పెష‌ల్ విషెస్ తెలిపిన మ‌హేష్ పుకార్లుకు పులిస్టాప్ పెట్టాడు. పూరీని త‌ను ఎంత‌గానో అభిమానిస్తున్న‌ట్టు ట్వీట్ ద్వారా తెలియ‌జేశాడు. నా అభిమాన డైరెక్టర్లలో ఒకరైన పూరీ జగన్నాథ్‌కి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా, విజయోత్సాహంతో ఉండాలని కోరుకుంటున్నా` అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు మ‌హేష్‌.

జ‌న‌గ‌ణ‌మ‌న  పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా,  త్వ‌ర‌లోనే ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాన‌ని అప్ప‌ట్లో అఫీషియ‌ల్‌గా  పేర్కొన్నాడు. ఈ మూవీ పేట్రియాటిక్ సబ్జెక్టుతో  పాన్ ఇండియా మూవీగా రూపొంద‌నుంద‌ని స‌మాచారం. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్నాయి. కాగా, ఇస్మార్ట్ శంక‌ర్‌తో భారీ హిట్ కొట్టిన పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అనన్య పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఫైట‌ర్ చిత్రం చేస్తున్నాడు. చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.logo